FbTelugu

ఉద్యోగులకు కేంద్రం నూతన మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి కేంద్రం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే విధులకు హాజరు కావొద్దని తెలిపింది. సెక్రెటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు విధులకు హాజరు కావాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ఉద్యోగులు ఇంట్లోనే ఉండాలని సూచించింది.

You might also like