FbTelugu

లాక్ డౌన్ సడలింపులపై జాగ్రత్త: కేంద్రం లేఖ

న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం ఆధారంగా లాక్ డౌన్ ఆంక్షల విధించడం లేదా సడలింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఆంక్షల మినహాయింపుల అనంతరం కూడా కరోనా నియంత్రణకు 5 సూత్రాలను అమలు చేయాలని స్పష్టం చేసింది.

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖలు రాశారు. కేసులు తగ్గుముఖం పట్టాయని పలు రాష్ట్రాలు ఆంక్షల సడలింపుల నేపథ్యంలో పలు సూచనలు చేశారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, నిరంతర నిఘా నియమాలను పాటించాలని స్పష్టం చేశారు. కేసులు తగ్గాయి కదా అని కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్యను తగ్గించకుండా కొనసాగించాలన్నారు. కేసుల సంఖ్య పెరిగినా, పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలని కోరారు. పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు జాగ్రత్తగా పునఃప్రారంభించాలని సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.