FbTelugu

కేంద్రాన్ని కంపెనీలు నడుపుతున్నాయి: టికాయత్

అహ్మదాబాద్: కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని కంపెనీలు నడిపిస్తున్నాయని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా టికాయత్ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. సోమవారం నాడు గాంధీనగర్ లో నిర్వహించిన ఆందోళనా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

కొత్త సాగు చట్టాలను బిజెపి ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని, అవసరమైతే గుజరాత్ లో రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. చట్టాలను రద్దు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారన్నారు. అయినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదని, కనీస స్పందన లేదని టికాయత్ ఆరోపించారు.
కేంద్రం దిగొచ్చే వరకు ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని, గుజరాత్ లో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి గాంధీ నగర్ లో వీధులను దిగ్బంధితామని టికాయత్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.