FbTelugu

బర్డ్ ఫ్లూపై కేంద్రం హై అలర్ట్

న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా తీవ్రంగా వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ పై కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ విధిస్తూ.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తికి ముఖ్యంగా వలస పక్షులే బర్డ్ ఫ్లూ కారణమని భావిస్తున్న తరుణంలో కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.

ముఖ్యంగా బర్డ్ శాంక్చూరీస్ ఉన్న ప్రత్యేక దృష్టి పెట్టింది. నాలుగు శాంక్చూరీస్ ఉన్న కేరళకు ప్రత్యేక సూచనలు చేసింది. అలాగే ఏపీలో కూడా పులికాట్, కొల్లేరు, ఉప్పలపాడు సహా పలు స్పాట్స్ లు ఉన్న తరుణంలో ఏపీ ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.