FbTelugu

జల ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్రం సిద్ధం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య జల ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయా కొత్త ప్రాజెక్టులు, నీటి వినియోగం వంటి విషయాల్లో వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశాన్ని నిర్వహించేందుకుగానూ  అపెక్స్‌ కౌన్సిల్‌ ముహూర్తం ఖరారు చేసింది.

ఆగస్టు 5న ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించేందుకు గానూ.. కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ ఏపీ, తెలంగాణ సీఎస్ లకు లేఖలు రాశారు. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించాలంటూ.. అపెక్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నిర్ణయించినట్టు సమాచారం.

ఈ సందర్భంగా ఆగస్టు 5న సీఎంలు అందుబాటులో ఉంటారా లేదా అన్నది సమాచారం ఇవ్వాలని కోరారు. 2016 ఆగస్టులో సీఎం కేసీఆర్‌, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో నాటి కేంద్రమంత్రి ఉమాభారతి నేతృత్వంలో అపెక్స్‌ సమావేశం జరగ్గా ఇది రెండోసారి.

You might also like