FbTelugu

ఆర్టీఏ లైసెన్స్ ల గడువు పొడిగించిన కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు అంశాల్లో మినహాయింపులు, సడలింపులు ఇస్తున్నారు. తాజాగా మోటారు వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్సులు, ఇతర పత్రాల గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఈ గడువు జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

ఫిట్‌నెస్‌, పర్మిట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌, ఇతర రవాణా సంబంధిత డాక్యుమెంట్లకు ఈ పొడిగింపు వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. 2020 ఫిబ్రవరి 1 నుంచి 2021 మార్చి 31 మధ్య గడువు పూర్తయ్యే పత్రాలకు ఈ మినహాయింపు వర్తించనున్నది. 2021 జూన్‌ 30 వరకు ఆ పత్రాలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. మహమ్మారి సమయంలో రవాణా శాఖ సేవలు పొందడంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.