FbTelugu

ఆయుధాలు ఉపయోగించాలంటూ ఆర్మీకి కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ : భారత సైనికులు ఒట్టి చేతులతో పోరాడాల్సిన పని లేదని, ఆయుధాలు ఉపయోగించండి అంటూ ఆర్మీకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తాజా పరిణామాల నేపథ్యం ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా లడఖ్ పై భారత వ్యాఖ్యలను ముఖ్యంగా ప్రధాని మోదీ స్పీచ్ ను చైనా సోషల్ మీడియా తొలగించింది.

ఈ సందర్భంగా జనరల్ వీకే సింగ్ మాట్లాడుతూ.. భారత సైన్యం బందీలుగా పట్టుకున్న చైనీస్ సైనికులను కూడా విడుదల చేశామని అన్నారు. గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనా సైనికులు 40 మందికి పైగానే చనిపోయారని స్పష్టం చేశారు. భారత్ చైనా మధ్య పెద్ద ప్రాబ్లమే ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.