FbTelugu

రాష్ట్రాలకు ఉచిత వ్యాక్సిన్లు: కేంద్రం

ప్రతిపక్షాలు, రాష్ట్రాల విమర్శలతో దిగొచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లు కొనుగోలు పై రాష్ట్రాల నుంచి, ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగివచ్చింది. రాష్ట్రాలకు తాము ఉచితంగా సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ ప్రకటించింది.
భారత్ బయోటెక్, సీరిం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, రెడ్డి ల్యాబ్స్ నుంచి రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తామని తెలిపింది. తాము ఒక్కో వ్యాక్సిన్ రూ.150 లకు కొనుగోలు చేస్తామని కేంద్రం వెల్లడించింది. ఇలా కొనుగోలు చేసిన వాటిని రాష్ట్రాలకు ఉచితంగా పంపిస్తామని పేర్కొంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

మూడు నాలుగు రోజుల క్రితం వ్యాక్సిన్లపై కేంద్రం ఒక ప్రకటన చేసింది. తాము ఒక్కో డోసు ను రూ.150 కొనుగోలు చేస్తున్నామని, రాష్ట్రాలు మాత్రం రూ.400 ల చొప్పున ఖరీదు చేసుకోవాలని సూచించింది. ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలు మాత్రం రూ.600 ఒక డోసు చొప్పున కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ప్రజలు కరోనాతో చస్తుంటే ధరలు ఎలా నిర్ణయిస్తారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎప్పుడు కూడా వ్యాక్సిన్లకు డబ్బులు వసూలు చేయలేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వమే వసూలు చేస్తూ ప్రజలను దోపిడి చేస్తున్నదని ఆరోపించారు. ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల విమర్శలతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా సరఫరా చేస్తామని తాజాగా ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.