FbTelugu

డోర్ టూ డోర్ రేషన్ కు కేంద్రం బ్రేక్

న్యూఢిల్లీ: ఏపీలో ఇంటింటికి రేషన్ కార్యక్రమానికి ఏలాంటి ఆంక్షలు పెట్టని కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన కు బ్రేకులు వేసింది.

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 25వ తేదీన ప్రారంభించాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఆగిపోనున్నది. జాతీయ ఆహార భద్రతా పథకం కింద తాము రాష్ట్రాలకు రేషన్ ఇస్తున్నామని, ఈ కార్యక్రమంలో ఎలాంటి మార్పులు చేయరాదని స్పష్టం చేసింది. ఇంతకు ముందే కేంద్ర ప్రభుత్వం ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2021పై కేజ్రీవాల్ ప్రభుత్వం ఆందోళనలు నిర్వహించింది. ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పటికీ లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారాలు కట్టబెట్టడం దారుణమని ఆప్ నాయకులు విమర్శిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కోతపెట్టడడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.