FbTelugu

ఒలింపిక్స్ తో వందేళ్ల విషాదం తప్పదు: వైద్యుల హెచ్చరిక

టోక్యో: జపాన్ దేశంలో ప్రస్తుతం కరోనా నాలుగో వేవ్ కొనసాగుతున్నది. ఒసాకా నగరం కేసులతో తల్లడిల్లిపోతున్నది. ఈ సమయంలో ఒలింపిక్స్ ను వాయిదా వేయాలి లేదా రద్దు చేయాలనే డిమాండ్లు జపాన్ లో ఊపందుకున్నాయి.
ఒకవేళ ప్రభుత్వం మంకుపట్టుతో నిర్వహిస్తే ఒలింపిక్ స్ట్రెయిన్ పుట్టుకువచ్చే ప్రమాదం ఉందని జపాన్ వైద్యుల సంఘం అధ్యక్షుడు నావోటో యుయేమా హెచ్చరించారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఉత్పరివర్తనం చెందిన రకరకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి. అక్కడి వాళ్లందరూ టోక్యోకు చేరుకుంటారు.

వారు వచ్చి ఆటలాడి వెళ్లిపోయిన తరువాత ఒలింపిక్స్ స్ట్రెయిన్ ఆవిర్భవించే అవకాశాలను తీసిపారేయలేమని నావోటో అన్నారు. అదే జరిగితే పెద్ద విషాదంగా మారుతుందని, కనీసం వందేళ్ల వరకు విమర్శలకు దారితీయవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ ఆరంభ సమయనికి 90 శాతం మంది క్రీడాకారులకు వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమం పూర్తవుతుందని, కఠిన ఆంక్షలతో నిర్వహిస్తామని జపాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రకటించడంతో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. జపాన్ ప్రభుత్వ వైఖరి, ఒలింపిక్స్ అసోసియేషన్ ను జనం తూర్పారపడుతున్నారు.

ఈ ఏడాది జూలై నెలలో జాపాన్ లో ఒలింపిక్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఏర్పాట్లు కూడా ఏడాదికాలంగా జరుగుతున్నాయి. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్ పొడిగిస్తున్నారు. వైరస్ విజృంభణ సమయంలో ఒలింపిక్స్ నిర్వహణ సబబు కాదని అంటున్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే క్రీడాకారుల రక్షణ, దేశ ప్రతిష్ట కోసం వీటిని వాయిదా వేయాల్సిందేనని 70 శాతం మంది ప్రజలు కోరుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.