FbTelugu

ఉదయాన్నే ఓటేసిన ప్రముఖులు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లో ఉదయం ఏడుగంటలకే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. బ్యాలెట్ పేపర్ తో నిర్వహిస్తుండడంతో ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభించారు.

ఈ రోజు ఉదయం కాచిగూడ పోలింగ్ స్టేషన్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి, తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు మన రాజ్యాంగ హక్కు అని అన్నారు. మనమందరం దీనిని సమర్థవంతమైన పరిపాలన కోసం తప్పనిసరిగా వినియోగించుకోవాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బంజారాహిల్స్ నంది నగర్ లో మున్సిపల్ శాఖా మంత్రి కె.తారక రామారావు దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కేటీఆర్ కోరారు.
రాజేంద్ర నగర్ డివిజన్ లోని ఉప్పర్ పల్లి లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లో మెగాస్టార్ కొణిదెల చిరంజీవి దంపతులు ఓటు వేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.