FbTelugu

కల్నల్ సంతోష్ బాబుకు ప్రముఖుల నివాళులు

సూర్యాపేట: భారత్-చైనా సరిహద్దులో చోటుచేసుకున్న ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు పలువురు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. నిన్న రాత్రి కల్నల్ పార్థీవదేహాన్ని సూర్యాపేటలోని ఆయన నివాసానికి ఆర్మీ అధికారులు చేర్చారు. కాగా ఇవాళ ఉదయం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ డి.అర్వింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తదితర ప్రముఖులు నివాళులు అర్పించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

You might also like