FbTelugu

ఏం సాధించారని సంబరాలు: యనమల

అమరావతి: ఏం ఘనకార్యాలు సాధించారని వైసీపీ సంబరాలు జరుపుకుంటోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతపై తీవ్రంగా విమర్శల వర్షం కురిపించారు. అమరావతి, పోలవరాన్ని నిలిపివేసి రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారని ఆరోపించారు.

ఇది వారోత్సవాలు జరుపుకునే సమయమా అంటూ ప్రశ్నించారు. కరోనాను రాష్ట్రంలో పెంచినందుకు సంబరాలా అంటూ నిలదీశారు. మద్యం షాపులు తెరిచి అన్న క్యాంటీన్లు మూసివేసినందుకా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులపై స్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

You might also like