FbTelugu

ఐపీఎల్ ఫ్యాన్స్ పండుగ చేస్కోండి…

ముంబై: ఐపీఎల్ అభిమానులకు తీపి కబురు అందింది. యూఏఈలో ఐపీఎల్ 2020 తో సందడిగా మారనున్నది. ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ ఎమిరెట్స్ క్రికెట్ బోర్డుకు అనుమతించింది.

అనుమతి లభించడంతో టీమ్ లు యూఏఈ బాటపట్టాయి. అబుదాబి, దుబాయ్, షార్జాలో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఈ నెల 21న యూఏఈ పయనం కానున్నది. అక్కడికి వెళ్లే లోగానే చిదంబరం స్టేడియంలో జరిగే ట్రైనింగ్ క్యాంప్ కు టీమ్ హాజరు కానున్నదని టీమ్ సీఈఓ కాశీ విశ్వనాథన్ మంగళవారం మీడియాకు తెలిపారు. టీమ్ లోని సభ్యులతో పాటు మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనా ఆగస్టు 16న చెన్నై చేరుకుంటారు. సెప్టెంబర్ 19న ఐపీఎల్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుండగా నవంబర్ లో ఫైనల్ మ్యాచ్ జరగనున్నది.

You might also like