FbTelugu

సిబిఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు, 12వ తరగతి వాయిదా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దృష్ట్యా కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ ప్రకటించారు.

సిబిఎస్ఈ పరీక్షల నిర్వహణపై ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. టెన్త్ బోర్డు పరీక్షలు రద్ధు చేయాలని నిర్ణయించారు. 12 వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా వేశారు. కరోనా సెకండ్ వేవ్ తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి రమేష్ వెల్లడించారు. జూన్ 1వ తేదీ సమీక్షించి 12వ తరగతి బోర్డు పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. పరీక్షలు రద్దు చేయాలని లేదా ఆన్ లైన్ లో నిర్వహించాలని కోరుతూ ఒక లక్ష మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి ఆన్ లైన్ లో పిటీషన్ సమర్పించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.