FbTelugu

సిలబస్ ను ఎందుకు తగ్గించాలి: సిబిఎస్ఈ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా గత విద్యా సంవత్సరం సిలబస్ తగ్గించిన సిబిఎస్ఈ రానన్న విద్య సంవత్సరంలో మాత్రం కాదంటోంది. గతేడాది కన్నా ఈ ఏడాది కరోనా వైరస్ విజృంభిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించినప్పటికీ సిబిఎస్ఈ మొండి వైఖరి అవలంభించడం శోచనీయం.

కరోనా వైరస్ ప్రభలడంతో గతేడాది పాఠశాలలను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సిలబస్ లో 30 శాతం వరకు తగ్గించింది. ఈ ప్రకారంగానే మే, జూన్ నెలల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే 1921-22 విద్యా సంవత్సరంలో మాత్రం సిలబస్ తగ్గించడం లేదని సిబిఎస్ఈ ప్రకటించడం తల్లిదండ్రులకు ఆగ్రహాన్ని తెప్పించింది. గత ఏడాది కన్నా ఈ ఏడాది కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదు అవుతుండగా, ఇదేం నిర్ణయం అంటూ విద్యార్థులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.