FbTelugu

మార్చి 4 నుంచే సీబీఎస్ఈ పరీక్షలు

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూలు ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ఇవాళ అధికారికంగా ప్రకటించారు. మే 4వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

సీబీఎస్ఈ పది, పన్నెండు తరగతులకు మార్చి 1 నుంచి ప్రాక్టికల్స్ ఉంటాయని, 4 నుంచి రాత పరీక్షలు ఉంటాయన్నారు. జూలై 15న పరీక్షా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరిలో ప్రాక్టికల్స్ నిర్వహించి, ఫిబ్రవరి, మార్చి నెలలో రాత పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో ఈ సారి మూడు నెలలు ఆలస్యంగా నిర్వహిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.