FbTelugu

సీబీఎస్ఈలో సిలబస్ తగ్గింపు: కేంద్ర మంత్రి రమేష్

ఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకున్నది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను 9వ తరగతి నుంచి 12 తరగతి వరకు 30శాతం సిలబస్‌ తగ్గించారు.

ఈ మేరకు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పొఖ్రియాల్ సిలబస్ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో తరగతి గదులు లేకపోవడం, అధ్యాపకులు అందుబాటులో లేకపోవడంతో సిలబస్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తల్లిదండ్రులు, విద్యావేత్తలు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామని ఆయన తెలిపారు. తగ్గించిన సిలబస్ నుంచి పరీక్షల్లో ఎటువంటి ప్రశ్నలు ఉండవని మంత్రి రమేష్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.