FbTelugu

వివేకా హత్య కేసులో సీబీఐ తాత్కాలిక విరామం

కడప: మాజీ ఎంపీ వైఎస్‌.వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తాత్కాలిక విరామం తీసుకున్నది. సీబీఐ బృందం కడప నుంచి ఢిల్లీ వెళ్లింది.

కడప జిల్లాలో సీబీఐ బృందం రెండు వారాల నుంచి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.  కడప, పులివెందులలో సీబీఐ అధికారులు పలువురిని విచారించారు. వివేకా కుమార్తె డా.సునీత, వైసీపీ నేత నేత శివశంకర్‌ రెడ్డి, వివేకా పీఏ కృష్ణా రెడ్డి తదితరులను విచారించారు. వివేకా కుమార్తె సునీత సమక్షంలో వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మీదేవి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయ్‌ తుల్లాను అధికారులు విచారించారు.

ఇంకా పలువురు అనుమానితులను విచారించేందుకు నోటీసులు సిద్ధం చేశారు. రెండు వారాల పాటు విచారించిన అధికారులు తదుపరి ఆదేశాల కోసం తాత్కాలిక విరామం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కడప చేరుకున్న బృందం తొలుత పదిరోజుల పాటు పులివెందుల వెళ్లి ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. వివేకా ఇంటిలో సీబీఐ అధికారులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. పులివెందుల పోలీసుల నుంచి సిట్‌ దర్యాప్తు నివేదికను తెప్పించుకున్నారు.

You might also like