FbTelugu

శ్రీశైలం ఘటనపై సిబీఐ విచారణ చేయాలి: రేవంత్

హైదరాబాద్: శ్రీశైలం పవర్ ప్లాంట్ దుర్ఘటనపై సిబీఐ విచారణ చేస్తే తప్ప నిజాలు వెలగులోకి రావని కాంగ్రెస్ ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అర్థరాత్రి పూట పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. శ్రీశైలం ఎడగమగట్టు విద్యుత్ కేంద్రాన్ని చంపేసే కుట్ర మొదలైందని ఆయన ఆరోపించారు. ఏపీ సీఎం వైఎస్.జగన్ రెడ్డికి తెలంగాణ సీఎం ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా మద్దతు ఇస్తున్నారని, పైకి మాత్రం విమర్శలు చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలోని సంస్థలు విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి రావని, సీబీఐ విచారణ చేయాలని ఆయన రేవంత్ డిమాండ్ చేశారు. చనిపోయిన ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన అన్నారు.

You might also like