FbTelugu

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ విచారిస్తాం: సిబిఐ

హైదరాబాద్: ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటీషన్ రద్దు విచారణ కు అర్హత ఉందా లేదా అనే అంశంపై సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టత నిచ్చింది. బెయిల్ రద్దు పిటీషన్ విచారణకు అనుమతిస్తామని సిబిఐ కోర్టు కోర్టు తీర్పునిచ్చింది.
సిఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దుపై నరసాపురం వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమరాజు కొద్ది రోజులుగా పోరాడుతున్నారు.

తొలిసారి బెయిల్ రద్దు చేయాలని దాఖలు చేసిన పిటీషన్ లో కొన్ని లోపాలు ఉండడంతో తిరస్కరించి. మళ్లీ పూర్తి వివరాలతో రాఘురామ కృష్ణమరాజు గతవారం దాఖలు చేశారు. జగన్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 ఛార్జ్ షీట్లు సిబిఐ నమోదు చేసిందని తన పిటీషన్ లో కోరారు. తమ పార్టీకి చెడ్డపేరు రాకుండా ఉండాలని పిటీషన్ వేశానని తెలిపారు. గత వారం పిటీషన్ పై ప్రత్యేక కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ నెల 27న పిటీషన్ ను విచారణ జరపాలా లేదా అన్నదానిపై తీర్పు వెలువరించనున్నట్లు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి తెలిపారు. ఆ ప్రకారంగానే ఇవాళ పిటీషన్ విచారణకు అనుమతిస్తామని జడ్జి తీర్పునిస్తూ ఉత్కంఠకు తెరదించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.