FbTelugu

ఎంపీ రాజు పై సీబీఐ ఫోర్జరీ కేసు నమోదు

చెన్నై: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణమరాజు పై సిబిఐ మరో కేసు నమోదు చేసింది. చెన్నై ఎస్.బి.ఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు.
ఫోర్జరీ, ఫోర్జరీ‌ పత్రాలతో బ్యాంకులను మోసం చేసిన రఘురామ రూ.237 కోట్లు రుణాల ఎగవేసినట్లు ఫిర్యాదు చేశారు.

ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్, డైరెక్టర్ ఎంపి రఘు రామ కృష్ణమ రాజు, ఇతర డైరెక్టర్లు కనుమూరు రమాదేవి, రాజ్ కుమార్ గంటా, దుంపల మధు సూదన రెడ్డి, నారాయణ ప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్ ల పై కేసు నమోదు అయ్యింది. రుణంగా పొందిన రూ.237 కోట్ల రుణాలను పక్కదారి పట్టించినట్లు సిబిఐ కు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.