FbTelugu

వివేకా కేసులో దూకుడు పెంచిన సీబీఐ

కడప: మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది.
సీబీఐ అధికారులు నేడు లేదా రేపటి నుంచి అనుమానితులను విచారించనున్నారు. కడప కేంద్రంగా విచారణకు శ్రీకారం చుట్టారు. మూడు సిట్ బృందాల నుంచి ఇప్పటి వరకు సేకరించిన సమాచారాన్ని అధికారులు ఇంగ్లీష్ లోకి తర్జుమా చేశారు.

కేసుకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ రెండు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రధానంగా కడప జిల్లా కేంద్రం గా అనుమానితులను విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పులివెందుల పోలీసుల సహకారంతో కీలక అనుమానితులను కడప కి తరలించి విచారించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె డా.సునీత అనుమానం వ్యక్తం చేసిన ప్రముఖులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది.

You might also like