FbTelugu

హోం మంత్రి అనీల్ పై సిబీఐ విచారణకు ఆదేశం

ముంబయి: మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనీల్ దేశ్ ముఖ్ పై సిబిఐ విచారణ చేపట్టాలని ముంబయి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ రెండు వారాల్లో ప్రారంభించాలని సిబిఐని ఆదేశించింది.

రూ.100 కోట్లు వసూలు చేసి ప్రతి నెలా తనకు అందచేయాలని హోం మంత్రి అనీల్ దేశ్ ముఖ్ ముంబయి పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కు లేఖ రాశారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పరమ్ బీర్ సింగ్ ముంబయి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్ విచారించిన హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయాన్ని పరమ్ బీర్ సింగ్ తరఫు న్యాయవాది డాక్టర్ జైశ్రీ పాటిల్ మీడియాకు వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.