FbTelugu

సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ?

పాట్నా: వచ్చే ఎన్నికల్లో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై విపక్షాలు నిలిదీసే ప్రమాదం ఉండడంతో జేడీయూ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆత్మహత్య ఘటనపై బీహార్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

సుశాంత్ సింగ్ ముంబై లో ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు రాగా, ఆయనది పక్కా హత్యేనంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి బాంబు పెల్చాడు. సుశాంత్ మృతదేహం లభ్యమైన గదిలో లభించిన ఆనవాళ్ల ఆధారంగా ఆయన 26 ప్రశ్నలు లేవనెత్తారు. సీబీఐ విచారణ జరిగితే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి సంజయ్ కుమార్ ఝా చేసిన వ్యాఖ్యలు ఔననే విధంగా ఉన్నాయి. సుశాంత్ తండ్రి ఇప్పటికే పాట్నాలో నటి రియా చక్రవర్తిపై పోలీసు కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు సీబీఐకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

అయితే సుశాంత్ సింగ్ ముంబైలో ఆత్మహత్య చేసుకోగా, బీహార్ ప్రభుత్వం ఎలా సిబీఐ విచారణకు ఆదేశిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఈ నిర్ణయం తీసుకుంటారా అనే వాదన తెరమీదికి వచ్చింది.

You might also like