FbTelugu

జగన్ కు నోటీసులు పంపిన సిబిఐ కోర్టు

హైదరాబాద్: ఏపి సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఆ పార్టీకే చెందిన ఎంపి కె.రఘురామ కృష్ణమరాజు దాఖలు చేసిన పిటీషన్ పై సిబిఐ కోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది.

మే నెల 7వ తేదీన తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ప్రత్యేక కోర్టు తెలిపింది. అక్రమాస్తులకు సంబంధించి సిఎం జగన్ పై 11 కేసులు ఉన్నాయని, వాటి అన్నింటిలో ఆయన ముద్దాయిగా ఉన్నారని పిటీషన్ లో రాజు తెలిపారు. బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున జారీ చేసిన బెయిల్ ను రద్దు చేయాలని రాజు కోర్టును కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.