FbTelugu

డెల్టా ప్లస్ తో జాగ్రత్త: ఐసిఎంఆర్ మాజీ శాస్త్రవేత్త

న్యూఢిల్లీ: డెల్టా వేరియంట్ కన్నా డెల్టా ప్లస్ వేరియంట్ తో అత్యంత ప్రమాదమని, మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) మాజీ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగా ఖేడ్కర్ తెలిపారు.

దేశంలో ఇప్పటి వరకు 50 పైగా డెల్టా ప్లస్ వైరస్ కేసులు నమోదు అయ్యారని, ఒకరు చనిపోయారని ఆయన వెల్లడించారు. 12 రాష్ట్రాలలో ఈ వైరస్ ప్రభావం ఉందని, ఏ అవయంలోకి డెల్టా ప్లస్ ప్రవేశించిందనే దానిపై వ్యాధి తీవ్రత ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆందోళనకరమైందిగా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.