FbTelugu

ఏపీలో కుల పోరు..!

ఎస్‌.. మీరు చ‌దివింది నిజ‌మే. ఇదేం ఇప్పుడు నాటుకుంది కాదు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న‌ప్ప‌టి నుంచి ఇదే వ‌రుస‌. కోస్తా, రాయ‌లసీమ‌, ఉత్త‌రాంధ్ర మూడు ప్రాంతాల్లో మూడు కులాలు బ‌లంగా ఉంటాయి.

కానీ అంద‌ర్నీ క‌లుపుకోవ‌ట‌మో.. లేక‌పోతే.. ఎమోష‌న్‌గా ద‌గ్గ‌ర కావ‌టం ద్వారా క‌మ్మ‌, రెడ్డి వ‌ర్గాలు ద‌శాబ్దాలుగా చ‌క్రం తిప్పుతున్నాయి. చిరంజీవి పార్టీ ప్ర‌జారాజ్యం పేరుతో వ‌చ్చినా కాపులు పూర్తిగా చేరువ కాలేక‌పోయారు. అప్ప‌టికే ఉన్న వైఎస్సార్ కాపుల‌కు గ‌తంలో ఎవ్వ‌రూ ఇవ్వ‌నంత‌టి ప్రాముఖ్య‌త‌నివ్వ‌టం కూడా మ‌రో కార‌ణం. 2014లో గెలిచిన చంద్ర‌బాబు కూడా కాపు ఓటింగ్ కోసం ప‌వ‌న్‌తో జ‌త‌క‌ట్టారు. గెలిచాక కాపుల‌కు ఫండ్ ఏర్పాటు చేసి ఏటా రూ.1000 కోట్లు కార్పోరేష‌న్ ద్వారా అంద‌జేస్తామ‌న్నారు. కానీ.. ఎందుకో ఆశించినంత స‌క్సెస్ కాలేక‌పోయారు. పైగా ఐదేళ్ల స‌మ‌యంలో కాపు ఉద్యోగుల‌కు ప్ర‌మోష‌న్లు, పోస్టింగ్‌లు లేవ‌నే అప‌వాదు మూట‌గ‌ట్టుకున్నారు.

వాస్త‌వానికి గ‌తానికి భిన్నంగా క‌మ్మ వ‌ర్సెస్ క‌మ్మేత‌ర కులాల అన్న‌ట్టుగా 2019 ఎన్నిక‌లు సాగాయి. దీనికి వైసీపీ కార‌ణ‌మా.. నిజంగానే పాల‌న అలాగే సాగింద‌నే ఆరోప‌ణ‌లూ లేక‌పోలేదు. దీన్ని అవ‌కాశంగా మ‌ల‌చుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చాక‌చ‌క్యంగా పావులు క‌దుపుతున్నారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ, క‌ర‌ణం బ‌ల‌రాం వంటి టీడీపీ క‌మ్మ ఎమ్మెల్యేల‌కు ఆహ్వానం ప‌లికారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ 2014లో చేసిన త‌ప్పిదాల‌ను స‌రిదిద్దుకుంటూ… క‌మ్మ సామాజిక‌వ‌ర్గ బ‌లంగా ఉన్న‌చోట ఆ వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కే సీట్లిచ్చి గెలిపించారు. ఇదంతా గ‌తం.. మ‌రి 2020.. ఇక్క‌డా అదే ఎత్తుగ‌డ‌. క‌మ్మ‌వ‌ర్గానికి తాము చేరువ‌గా ఉన్నామంటూనే.. టీడీపీ ను బ‌ల‌హీన‌ప‌రిచేందుకు ఆ పార్టీకు ఆయువుప‌ట్టుగా మారిన క‌మ్మ‌, బీసీల‌ను త‌మ వైపున‌కు మ‌ళ్లించుకుంటున్నారు. క‌మ్మ వ‌ర్సెస్ రెడ్డి అనేది బ‌య‌ట‌కు వినిపిస్తున్నా.. తాము మాత్రం అంద‌రివాడు అనే భావ‌న‌ను జ‌నాల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇదంతా బ‌య‌ట‌కు క‌నిపిస్తున్న దృశ్యం. కానీ.. అంత‌ర్గ‌తంగా మాత్రం.. క‌మ్మ వ‌ర్సెస్ రెడ్డి వ‌ర్సెస్ కాపు అనే సామాజిక పోరు మాత్రం చాప‌కింద‌నీరులా విస్త‌రిస్తుంద‌నేది మాత్రం
బ‌హిరంగ ర‌హ‌స్యం.

You might also like