FbTelugu

వేలి ముద్రలు, నీటిచుక్కలతో కొత్తరకం చోరీ

హైదరాబాద్: కేటుగాళ్లు దొంగతనాలకు రోజు రోజుకి కొత్త పంథాలను వాడుతున్నారు. తాజాగా నగరంలోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు కేటుగాళ్లు ఆధార్ నెంబర్, వేలి ముద్రల ఫోటో, నీటి చుక్కల సాయంతో కొత్త రకం చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి చెందిన రెవెన్యూ వెబ్ సైట్ నుంచి కొందరు దుండగులు భూముల దస్తావేజులు డౌన్ లోడ్ చేసి దస్తావేజుల్లో ఉన్న ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫోటోలతో బ్యాంకు అకౌంట్ నుంచి నగదు స్వాహా చేశారు.

తనకు తెలియకుండా తన ఖాతా నుంచి రూ.10 వేలు కాజేశారని మధురా నగర్ కాలనీ కి చెందిన సిద్ధిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ మూర్తి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలను గుర్తించారు. కేవలం ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫోటో, నీటి చుక్కల సాయంతో పేపాయింట్ ద్వారా డబ్బు తస్కరించినట్టు గుర్తించారు. ఈ కేసులో నిందితులు విశాల్, అర్షద్ సీఏ విద్యార్థులుగా గుర్తించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.