FbTelugu

నంద్యాలలో భారీగా పట్టుబడ్డ నగదు

కర్నూలు: నంద్యాల మూడో టౌన్ పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది.
వాహనాల తనిఖీల్లో భాగంగా ఒక వాహనంలో తరలుతున్న రూ.38.26 నగదును గుర్తించిన పోలీసులు సీజ్ చేశారు. మహారాష్ట్ర చంద్రపూర్ నుండి చిత్తూరు జిల్లాలోని పుత్తూరుకు తరలిస్తుండగా నంద్యాల టోల్ గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. కారు నెంబర్ పీవై 05ఈ 3377 లో తరలిస్తున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఎవరి కోసం ఈ డబ్బులు తరలిస్తున్నారు అనేది ఆరా తీస్తున్నారు.

You might also like