FbTelugu

సుప్రీం కోర్టుకు కరోనా సెగ… ఆన్ లైన్ విచారణ

న్యూఢిల్లీ: నిన్న మొన్నటి వరకు ఆ నగరంలో, ఈ రాష్ట్రంలో ఎక్కువగా కేసులు నమోదు అయ్యాయని విన్నాం. కాని ఇప్పుడు సుప్రీంకోర్టులోను కేసులు అమాంతం పెరిగాయి.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అధిక శాతం సిబ్బంది మహమ్మారి బారిన పడడం కలకలం రేపుతోంది. ఈ విషయం తెలిసిన వెంటనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాల మేరకు ఇవాళ కోర్టు ఆవరణ, విచారణ గదులు, బహిరంగ ప్రదేశాలను పూర్తిగా శానిటైజ్ చేయించారు.

కోర్టులోని సగం మంది సిబ్బంది వైరస్ బాధితులుగా మారడంతో ఇక నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసులను విచారించాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. భారీ కేసుల నేపథ్యంలో కోర్టు బెంచ్‌లన్నీ ఇవాళ ఒక గంట ఆలస్యంగా కేసుల విచారణను ప్రారంభించాయి. కాగా, శనివారం ఒక్క రోజే 44 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో మిగతా వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.