FbTelugu

ఇండియా లో కేసులు 48వేలు

న్యూఢిల్లీ: దేశంలో గడచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు 48,698 నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ బారిన పడి 1,183 మంది చనిపోయారు.

తాజాగా 64,818 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటి వరకు 3,01,83,143 కేసులు నమోదు కాగా, 2,91,93,085 మంది రికవరీ అయ్యారు. వైరస్ బారిన పడి 3,94,493 మంది చనిపోయారు. దేశంలో 86 రోజులు తరువాత ఆరు లక్షల దిగువకు యాక్టివ్ కేసులు చేరుకున్నాయి. ప్రస్తుతం 5,95,656 పాజిటివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 96.72 శాతానికి పెరగ్గా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.97 శాతంగా ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.