FbTelugu

కరోనా రోగులు బయట తిరిగితే కేసులు…

చెన్నై: కరోనా పాజిటివ్ రోగులు బయట సాధారణ ప్రజల మాదిరి తిరిగితే కేసులు నమోదు చేస్తామని పుదుచ్చేరి జిల్లా కలెక్టర్ పూర్వాకర్గ్ హెచ్చరించారు. వైరస్ లక్షణాలతో ఉన్నవారిని పోలీసు, రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.

పుదుచ్చేరిలో చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్ హెల్త్, రెవెన్యూ, కమ్యూనిటీ ఆర్గనైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం తరువాత కలెక్టర్ పూర్వాకర్గ్ మీడియాతో మాట్లాడారు. అరియాం కుప్పం, రెడ్డియార్ పాల్యం, కుయవర్ పాల్యం, లాస్ పేట ప్రాంతాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉందన్నారు. వైరస్ లక్షణాలపై ఏమైనా సందేహాలు ఉంటే 104 నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు. జిల్లాలో కరోనా రోగుల వివరాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు, వ్యాక్సినేషన్, కేసుల నమోదుపై చర్చించామని జిల్లా కలెక్టర్ పూర్వాకర్గ్ వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.