FbTelugu

కేసులు పెరుగుతున్నా… పరీక్షలకు సిద్దమేనా?

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పరీక్షల నిర్వహణకే సిద్ధంగా ఉన్నారా అని హైకోర్టు ప్రశ్నించింది.

పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏజీ బీఎస్.ప్రసాద్ నివేదిక సమర్పించారు. జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షల ఏర్పాట్లను వివరించారు.

పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనర్ (ఏజీ) హైకోర్టుకు తెలిపారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తరఫున తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ లో కరోనా కేసులు పెరుగుతున్నాయని పిటీషనర్ కోర్టుకు విన్నవించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని పిటిషనర్ కోరారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

You might also like