FbTelugu

సోషల్ మీడియా పోస్టింగ్ లపై సీఐడీ కేసు

అమరావతి: సోషల్ మీడియాలో ఏపీ హైకోర్టు జడ్జీలకు వ్యతిరేకంగా పెట్టిన కామెంట్లపై సీఐడీ సైబర్ క్రైమ్ లో కేసు నమోదు అయింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు సీఐడీ సైబర్ క్రైమ్ అధికారులు కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియాలో పోస్టులపై సాక్ష్యాధారాలతో సహా సీల్డ్ కవర్‍లో సీఐడీకి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పంపారు. ఐటీ చట్టంలోని 67 సెక్షన్, ఐపీసీలోని 153(A), 505(2), 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. దరిశ కిషోర్‍రెడ్డిపై కేసు నమోదు చేసిన అధికారులు, వివరాలను సేకరించే పనిలో పడ్డారు.

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు కేసు సీబీఐకి అప్పగించడం, గ్రామ పంచాయతీ భవనాల రంగుల తీర్పు విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సోషల్ మీడియాలో జడ్జీలను కించపరుస్తూ పెద్ద ఎత్తున పోస్టింగ్ లు పెట్టారు. దీన్ని ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించి మంగళవారం నాడు 49 మందికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

You might also like