FbTelugu

విమాన పెళ్లిపై కేసు నమోదు

చెన్నై: విమానంలో పెళ్లి చేసుకున్నామన్న నూతన వధూవరుల ఆనందం ముగియక ముందే ఆవిరి అయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఛార్టెట్ ఫ్లైట్ లో నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసుకున్నారంటూ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది.

మధురైకి చెందిన రాకేశ్, దక్షిణలకు పెళ్లి కుదిరింది. లాక్ డౌన్ కారణంగా ఛార్టెడ్ ఫ్లైట్ లో పెళ్లి చేసి ఇరు కుటుంబాలు చిక్కుల్లో పడ్డాయి. ఈ పెళ్లి ఫొటోలు వైరల్ గా మారడం, నిబంధనలు పాటించకపోవడంతో డిజిసిఎ రంగంలోకి దిగింది. నూతన వధూవరులతో పాటు ఇరు కుటుంబాలపై కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నది. పెళ్లి సమయంలో విధుల్లో ఉన్న విమాన సిబ్బందిని రోస్టర్ నుంచి తప్పించింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిజిసిఎ ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలు విమానాల్లో, విమానాశ్రయాల్లో కఠినంగా అమలు చేస్తుననారు. విమానంలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేసింది. ఎగురుతున్న విమానంలో మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా పెళ్లి చేసుకోవడం డిజిసిఎ కు తలనొప్పిగా మారింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.