FbTelugu

అంబులెన్స్ మాఫియాపై కేసు నమోదు

తిరుపతి: అంబులెన్సు మాఫియాపై జిల్లాలోని అలిపిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న రుయా ఆస్పత్రినుంచి ఓ పేషెంటును బయటకు తీసుకెళ్లకుండా కొందరు అంబులెన్సు డ్రైవర్లు అడ్డుకున్నారు.

బయట నుంచి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ పై రుయా అంబులెన్స్ యూనియన్ నేతలు ఏకంగా దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు దాడికి పాల్పడ్డ ముగ్గురు డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like