FbTelugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

* రిపోర్టర్ ను చంపేస్తానంటూ ఫోన్ లో బెదిరింపులు
సంగారెడ్డి : టీఆర్ఎస్ పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై కేసు నమోదైంది. జాతీయ రహదారి వెంట టీఆర్ఎస్ ఎమ్యెల్యేలు భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ వార్త రాసిన ఓ రిపోర్టర్ కు మహిపాల్ రెడ్డి ఫోన్ చేసి తీవ్రంగా వార్నింగ్ ఇచ్చినట్టుగా.. ఓ ఆడియో సోషల్ మీడియాతో వైరల్ అయింది.

‘నాపేరు పెట్టి వార్త రాస్తావా.. ఇంటికొచ్చి కాళ్లు, చేతులు నరికేస్తా’ అంటూ ఫోన్ చేసి రెచ్చిపోయాడు. ఈ ఘటన నేపథ్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై ఐపీసీ సెక్షన్ 109,448,504,506, ఎస్సీ, ఎస్టీ యాక్ట్(2015) ల కింద అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.