హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.మల్లారెడ్డి, ఆయన కుమారుడిపై దుండిగల్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది.
కుత్బుల్లాపూర్ మండలం సూరారంలో 2 ఎకరాల 13 గుంటల భూమి శ్యామల అనే మహిళ పేరు మీద ఉంది. ఆ భూమిపై కన్నేసిన మల్లారెడ్డి ఎలాగైనా దక్కించుకోవాలనే దుర్భుద్దితో పావులు కదిపాడు.
అందులో 20 గుంటలు కబ్జా చేశాడు. ఈ విషయం తెలుసుకున్న యజమానురాలు శ్యామల ఎందుకు కబ్జా చేశారని నిలదీసింది. సరైన సమాధానం చెప్పకుండా దాటవేయడంతో ఆమె దుండిగల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మంత్రి మల్లారెడ్డి భూమి అమ్మాలని బెదిరిస్తున్నాడని, తన స్థలం కబ్జా చేశాడని ఫిర్యాదు అందచేసింది. తన లాయర్ ను తన వైపు తిప్పుకున్నాడని ఆరోపించింది.