FbTelugu

చంద్రబాబుపై కేసు నమోదు

* రాళ్లదాడి చేయించారంటూ ఆరోపణ
విజయనగరం: టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పోలీసు కేసు నమోదైంది. రామతీర్థం సందర్శనకు వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై పలువురు చెప్పులు, రాళ్లు విసరడంతో కారు అద్దం పగిపోవడంతో విజయసాయి రెడ్డి వేరే కారులో వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

ఆ రాళ్ల దాడిని చేయించింది చంద్రబాబేనంటూ.. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చంద్రబాబుతో పాటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులపైనా పీడీపీపీ యాక్ట్‌ కింద కేసులు నమోదైనట్టు పోలీసులు స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.