FbTelugu

నేడు కోర్టు ముందుకు రాసలీల యువతి

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర మంత్రి రమేష్ జర్కహోళి పదవికి ముప్పుతెచ్చిన రాసలీల కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. బాధిత యువతి విడుదల చేసిన సిడి దెబ్బకు రమేష్ మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
ఈ కేసుల కర్ణాటక రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. బాధిత యువతి ఇవాళ కోర్టు ముందు లొంగిపోయే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందడంతో అప్రమత్తమైంది. రమేష్ జర్కహోళిపై మార్చి 2వ తేదీన సిడి విడుదల చేసిన యువతి ఆ తరువాత పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి దాకా ఐదు సిడిలను విడుదల చేసి సంచలనం సృష్టించింది. ప్రభుత్వ పెద్దలకు నిద్రలేకుండా చేసింది.

ఆమె కోసం పోలీసులు విస్తృతంగా గాలించినప్పటికీ ఆచూకి లభ్యం కాలేదు.
కోర్టులో లొంగిపోవాలని నిర్ణయించుకున్న సదరు యువతి ఆదివారం నాడు న్యాయవాది జగదీశ్, తన సహోద్యోగి మంజునాథ్ తో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆమె వెల్లడించిన సమాచారం ప్రకారం ఇవాళ కోర్టు ముందు లొంగిపోనున్నట్లు తెలిసింది. కోర్టులో లొంగిపోయిన వెంటనే అదుపులోకి తీసుకునేందుకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేసింది. యువతి తల్లిదండ్రులపై దాడులు జరుగకుండా ఉండేందుకు పోలీసులు భద్రత కల్పించారు. ఈ కేసు విషయమై సిఎం యడ్యూరప్ప హోం శాఖ మంత్రి బసవరాజ బొమ్మైతో ఆదివారం నాడు సుధీర్ఘంగా చర్చించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.