FbTelugu

బాలీవుడ్ బ్యూటీ పై పశ్చిమ బెంగాల్ లో కేసు

కొలకతా: సోషల్ మీడియా ద్వారా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ టిఎంసి ప్రతినిధి రిజు దత్తా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ పై ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు పరిశీలించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి కుమారి మమతా బెనర్జీ చిత్రాలను వక్రీకరించి సోషల్ మీడియాలో కంగానా షేర్ చేసిందని తన ఫిర్యాదులో తెలిపాడు. ఆమెపై కొలకతా పోలీసులు ఐపిసి 153ఏ, 504, 505 సెక్షన్లతో పాటు, ఐటి చట్టంలోని 43,66 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీసు కేసులపై కంగనా రనౌత్ స్పందిస్తూ, నా గొంతును చంపుతున్నారంటూ మమతా బెనర్జీపై ఆరోపణలు కూడా చేసింది. అక్రమ కేసులు, బెదిరింపులతో తనను భయపెట్టలేరని స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.