జైపూర్: యోగా గురువు రామ్ దేవ్ బాబా సహా ఐదుగురిపై జైపూర్లో కేసు నమోదు అయ్యింది. కరోనాను తగ్గించే మందు అంటూ తప్పుడు ప్రచారం చేశారని కేసు వేశారు.
రెండు రోజుల క్రితం యోగా గురువు రామ్ దేవ్ బాబా కొరోనిల్ మందును ఆవిష్కరించారు. ఈ ఔషధంతో కరోనా నయమవుతుందని, పూర్తి ఆరోగ్యవంతులు అవుతారని ఆయన ప్రకటించారు. ఆయన విడుదల చేసిన గంటల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మందును విక్రయించకూడదని, ఎలాంటి శాస్త్రీయత లేదని స్పష్టం చేసింది. అయితే దగ్గు మందు పేరుతో అనుమతి తీసుకుని మార్కెట్ లోకి విడుదల చేసినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసింది.
బిహార్ లో కేసు కూడా నడుస్తోంది. కరోనా మందు పేరుతో ప్రజలను మోసం చేశారంటూ ఒకరు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.