FbTelugu

నల్గొండలో ఎంపీ బండి సంజయ్ పై కేసు

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై నల్లగొండ జిల్లాలో కేసు నమోదైంది. వివరాల్లోకెళితే.. నిన్న బండి సంజయ్ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ.. స్థానిక ఊట్లపల్లిలో బత్తాయి రైతులను పరామర్శించారు.

లాక్ డౌన్ లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బత్తాయి రైతులను ఆదుకుంటామని తెలిపారు. రైతులను పరామర్శించిన క్రమంలో భౌతిక దూరం పాటించలేదన్న కారణంతో పోలీసులు బండి సంజయ్ తో పాటూ అతని అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు.

You might also like