FbTelugu

హీరో సిద్దార్ధ్ పై హైదరాబాద్ లో కేసు.

  1. Siddharth
  1. Police Case filed against Hero Siddarth in Hyderabad ; ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడా కారాణి సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్ధ చేసిన కామెంట్స్ తీవ్ర రుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. సైనాపై సిద్దార్ధ చేసిన వివాదాస్పద ట్వీట్ దేశ వ్యాప్తంగా దుమారాన్ని లేపింది. ఇది సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టించింది. సైనాను “కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేయడంతో ప్రముఖులు అందరూ ఖండించారు. సైనాకు సిద్దార్ద్ క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ లు వచ్చాయి. మరో పక్క కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూడా స్పందించి సిద్ధార్ధ్ వ్యాఖ్యలను ఖండించారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో సైనాకు క్షమాపణలు తెలియజేశారు సిద్ధార్ధ్. క్షమాపణలు తెలియజేస్తూ సిద్ధార్ధ ట్వీట్ చేశారు. “డియర్ సైనా, కొన్ని రోజుల క్రితం మీరు చేసిన ట్వీట్ కు సమాధానంగా ఒక పోస్టు పెట్టాను. నీ మీద దారుణమైన జోక్ వేసినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను, అయితే సైనాపై చేసిన వ్యాఖ్యలను పురస్కరించుకుని సిద్ధార్ధపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 509, ఐటీ యాక్ట్ 67 ప్రకారం సిద్ధార్ధపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. మరో పక్క సిద్ధార్ధ చెప్పిన క్షమాపణలకు సైనా రిప్లై ఇచ్చారు. “అతడే ట్విట్టర్ లో ఆ విధంగా అన్నారు. ప్రస్తుతం క్షమాపణలు చెబుతున్నారు. సిద్ధార్ధ ట్వీట్ చేసిన రోజు నేను ట్విట్టర్ లో ట్రెండ్ అయినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. అతడితో ఇప్పటి వరకూ నేను మాట్లాడలేదు. కానీ అతను క్షమాపణలు చెప్పినందుకు నేను సంతోషిస్తున్నాను. ఆ ట్వీట్ మహిళలకు సంబంధించినది. మహిళలను లక్ష్యంగా చేసుకుని అటువంటి పనులు చేయకూడదు. ఇటువంటి వాటిని నేను పట్టించుకోను. ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నాను. దేవుడి ఆశీస్సులు అతడికి ఉండాలి” అంటూ సైనా నెహ్వాల్ తెలిపింది.
You might also like

Leave A Reply

Your email address will not be published.