FbTelugu

హీరో ప్రభాస్ పై కేసు నమోదు

హైదరాబాద్: ప్రముఖ నటుడు ప్రభాస్ పై రాయదుర్గం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. వివాదంలో ఉన్న ప్రభుత్వ భూమిలో అడుగుపెట్టాడంటూ ప్రభాస్ పై రాయదుర్గం పోలీసు స్టేషన్ లో రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు పరిశీలించిన పోలీసులు ప్రభాస్ పై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. రాయదుర్గం సర్వే నెంబర్ 46 లోని 84 ఎకరాల భూమికి సంబంధించి నాలుగు దశాబ్ధాలుగా వివాదం నడుస్తోంది. ఇదే భూమిలో సుమారు 2,500 చదరపు గజాల్లో ప్రభాస్ గెస్టు హౌస్ నిర్మించుకున్నారు. దీన్ని క్రమబద్దీకరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో దరఖాస్తు సమర్పించాడు.

అయితే ఆ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ గతంలోనే శేరిలింగంపల్లి తహసీల్దార్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. లాక్ డౌన్ సమయంలో తన గెస్ట్ హౌస్ లోకి ప్రవేశించేందుకు ప్రభాస్ యత్నించాడని రెవెన్యూ అధికారులకు సమాచారం వచ్చింది. వెంటనే రెవెన్యూ అధికారులు రాయదుర్గం పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

You might also like