FbTelugu

బ్లాక్ మెయిలర్ తీన్మార్ మల్లన్నపై కేసు

హైదరాబాద్: ఫేస్ బుక్, యూ ట్యూబ్ లో క్యూ టివి పేరుతో ఛానల్ నిర్వహిస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై చిలకలగూడ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సీతాఫల్ మండి మధురానగర్ కాలనీలో మారుతీ సేవా సమితి పేరిట లక్ష్మీకాంత శర్మ జ్యోతిషాలయం నిర్వహిస్తున్నాడు. శర్మ కొన్ని టివి ఛానళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 19న తీన్మార్ మల్లన్న తనకు ఫోన్ చేసి రూ.30 లక్షలు ఇవ్వాలని, లేదంటే భండారం బయటపెడతానంటూ బెదిరించాడని పోలీసులకు తెలిపాడు. అతను డిమాండ్ చేసిన ప్రకారం డబ్బులు ఇవ్వకపోవడంతో 20వ తేదీన తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేశాడని ఫిర్యాదులో వెల్లడించాడు. 22వ తేదీన లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదు చేయడంతో పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతున్నదని, పలు సెక్షన్ల కింద అతని పై కేసు పెట్టామని చిలకలగూడ పోలీసు స్టేషన్ సిఐ నరేష్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.