FbTelugu

జప్తు వాహనాలు తీసుకువెళ్లండి: డీజీపీ

అమరావతి: ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి యజమానులు పొందవచ్చని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.

వాహనాలకు సంబంధించిన సరైన ధృవపత్రాలను సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమర్పిస్తే సరిపోతుందన్నారు. వాహనాలు తిరిగి యజమానులకు అప్పగించే విషయంపై ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశాహన్నారు. వాహన యజమానులు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సంప్రదించగలరని ఏపీ డీజీపీ తెలిపారు.

You might also like