FbTelugu

మహిళను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కారు

ఢిల్లీ: దేశ రాజధానిలోని పాత ఢిల్లీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ కారు మహిళను ఢీకొట్టి కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన అనంతరం అక్కడి నుంచి కారును నడిపిన దుండగులు పరారయ్యారు.

ఇది గమనించిన స్థానికులు తీవ్రగాయాలపాలైన ఆ మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like