FbTelugu

దంపతుల ఆత్మహత్య… ఎమ్మెల్యే దహన సంస్కారాలు చేయాలి!

హైదరాబాద్: కారు డ్రైవర్ దంపతులు చికిత్స పొందుతూ ఆత్మహత్య చేసుకున్నారు. తమ దహన సంస్కారాలను జూబ్లిహిల్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చేయాలంటూ ఆత్మహత్య లేఖలో కోరారు.
రహ్మత్ నగర్ కు చెందిన ఎన్.సుబ్బారావు కారు డ్రైవర్ కాగా, ఆయన భార్య సాయిలక్ష్మీ గృహిణీగా ఉంది. సాయి లక్ష్మీకి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రాజ్ భవన్ క్వార్టర్ సమీపంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. ఈ నెల 11వ తేదీన ఉదయం ఆసుపత్రి సిబ్బంది వెళ్లి చూడగా ఇద్దరూ అపస్మార స్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని వెంటనే ఆమె కుమార్తె శివాణికి ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేసి తెలిపారు. ఆమె చేరుకునే లోపే తల్లి చనిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న తండ్రి సుబ్బారావును గాంధీ ఆసుపత్రికి తరలించగా ఆయన కూడా చికిత్స పొందుతూ సాయంత్రం చనిపోయాడు.

వారి బెడ్ పక్కనే ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నా చావుకు ఎవరూ కారణం కాదని, ఆసుపత్రి సిబ్బందికి కూడా సంబంధం లేదని తెలిపాడు. మానసిక వ్యధతో చనిపోతున్నానని, తన దహన సంస్కారాలు ఎమ్మెల్యే మాగంటి గోపిణాథ్ చేయాలని లేఖలో కోరాడు. అనారోగ్యం సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారా లేదా భార్య గొంతు నులిమి తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.